![]() |
| Nagula Pooja |
నాగుల పుజ మనకు అనాది కాలం నుండి వస్తున్న ఆచారం . అనాది నుండి వస్తున్నా ప్రజల్లోని మూఢత్వం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు . ఎంతో మహిమాన్వితమైన సర్ప పుజ కేవలం పుట్ట లో పాల ఫలహారాలకే సరిపోతుంది . పూజ దాని విధి యెక్క అంతరార్ధం మరుగున పడిపోతుంది .
దేవతారాధనలో సాత్విక తామసిక రాజశికా అను మూడు విధానాలు ఉన్నాయి . వాటిలో రాజసిక ఆరాధన ఇష్ట కామ్య సిద్ధి కోసం చేస్తారు. పూజని బట్టి దేవత స్వరూపం ఉంటుంది. సర్పాలు రాజసిక గుణము కలిగినవి వాటి ఆరాధన వలన ప్రజలు ఎంతో మేలు పొందవచ్చు . ముఖ్యంగా సర్పాలను సతసన్తానం కోసం పూజిస్తారు. ఇలా చేయడం వెనుక అంతరార్ధం లేకపోలేదు . సంతానానికి కారణమయ్యే జీవ కణాలు సర్పాకృతుని పోలి ఉంటాయి . దానికి చిహ్నంగానే సంతాన దాయకుడైన సుభ్రమన్యుడు స్వాధిష్టాన చక్రంలో ఉంటాడు . అందుకే ఉపాసకులు ఆయన్ని ఆ చక్రంలోనే ధ్యానం చేస్తారు . సుభ్రమన్యున్ని జంట పడగల రూపంలో పూజించడానికి కూడా కారణం ఇదే . సర్పాలకు సంబంధించిన మంత్రాల యొక్క శక్తి నేరుగా జనన అంగాల మీద పడి ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది.
ఇక ఆయనకు నివేదన చేసే పదార్ధాలు ఎంతో మహిమ కలిగినవి . నువ్వుల పప్పు గర్భాశయ రుగ్మతలను పోగొడుతుంది . కానీ నువ్వులు అధిక వేడిని కలుగ చేస్తాయి అందుకే దానికి తోడుగా చలువకి చలిమిడి కూడా వాడుతారు . సజ్జల పిండి పురుషుల్లో వీర్య వృద్ధికి తోడ్పడుతుంది . ఇక ఆయనకు చేసే అభిషేకంలో వాడే పంచామృతం ఒక ఔషధ సమ్మేళనం ఆవు పాలు తేజస్సుకి దధి వీర్య వృద్ధికి నెయ్యి ధాతు పుష్టికి తోడ్పడతాయి . ఇలా ప్రతీ నివేదన వెనుక ఒక రహస్యము ఉంది . ఆయన పేరున ఇలా ఉపవాసం ఉండి ఈ ఆహార పద్దతిని పాటిస్తూ నాగ మంత్రాలు స్తోత్రాలు పాటిస్తే సతసన్తానం కలుగుతుంది అని అనాది నుండి వస్తున్న ఆచారం .
ఇంత ఘనమైన ఆచారం వదిలేసి ప్రజలు లీటర్లు లీటర్లు పుటల్లో పోస్తున్నారు . ఎంతో విలువైన ప్రసాదాన్ని మట్టి పాలు చేస్తున్నారు . అసలు దైవం అని భావించాక నాగాన్ని ఒక సామాన్య సర్పంలా భావించరాదు. ఒక వేళ భావించిన సర్పాలు మనం నివేదన చేసే ఏవీ ఆరగించావు . దైవానికి నివేదన చేసింది ఎప్పుడూ వృధా అవ్వకూడదు మనమే ప్రసాదంగా భావించి సేవించాలి అపుడే వాటిలో ఉన్న ఔషధ గుణాలు మనకు ఆపాదించి అంతరార్ధం నెరవేరుతుంది .నాగదేవత అభిషేకానికి పచ్చి పాలు నివేదనకు కాచిన పాలు వాడతారు.
మణులు కలిగిన సర్పాలే దేవతా శక్తిని కలిగి ఉంటాయి వాటినే నాగములు అంటారు. అటువంటి నాగములు మిగిలిన సర్పాలులా కాక అత్యంత తేజస్సుతో ఉంటాయి . వాటి వేగము ప్రకాశము చూడటానికి రెండు కళ్ళు చాలవు మెరుపులా ఉంటాయి. అటువంటి నాగాలు ఒకసారి పాదం మోపినా కొన్ని తరాలు తరించిపోతాయి . వాటికి జనన మరణాలు ఉండవు ఆధ్యంతం అఖండ జ్యోతిలా వాళ్ళ శక్తి ప్రసరిల్లుతూంటుంది. కావున నాగదేవతలని కేవలం సర్పంగా భావించవద్దు. వారి మంత్రాలు స్తోత్రాలు చదివి తరించండి .

0 comments:
Post a Comment