ముత్యాలమ్మ

Mutyalamma Talli
ముత్యాలమ్మ లేదా ముత్తుమారెమ్మ/ముత్యాల పోచమ్మ అనే దేవత దక్షిణా పధంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పేరు . ఈవిడని పోలవీరామాంబ లేదా పోలేరమ్మ అని కూడా అంటారు . ఏ పూజ చేసినా ముత్యాలమ్మతో మొదలయ్యి మైసమ్మతో ముగియాలి అంటారు . ఏడుగురు అక్కలుగా పిలవబడే వారిలో చిన్నది ముత్యాలమ్మ . శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పాడుబడ్డ ముత్యాలమ్మ గుళ్ళు పచ్చని పసుపుతో కళకలాడుతుంటాయి . పప్పు పాయసం పానకం కుడుములు పూర్ణంబూరెలు గారెలు ఇలా ఎన్నో పిండి వంటలు వారపోస్తుంటారు జానపదులు .

ముత్యాలమ్మ ఆవిర్భావం మనం కనుక చూసుకున్నట్లైతే ఈవిడ గత్తర ఆటలమ్మగా పిలవబడే రోగాలకు చలువగా ఈ అమ్మవారిని కొలుస్తుంటారు . మున్ముందు ఈ దేవత సమవర్తి ఐన యముణ్ణి ఆవహించిందని ఆ తరువాత సూర్యుణ్ణి తరువాత భూమండలంకి వచ్చిందని తమిళనాట జానపదుల ప్రకారం తెలుస్తుంది . జమదగ్నిచేత శ్యాప గ్రస్తురాలైన రేణుక భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడింది . ఆ చర్మ వ్యాధి ఇంకేమి కాదు ఈ ఆటలమ్మ గత్తరే . అందుకే భూమి మీద మొదట ముత్యాలమ్మ ఆవరించినది రేణుకకు మాత్రమే అలానే ఆ దేవిని ప్రసన్నం చేసుకొని విరుగుడు పొందినది కూడా రేణుకనే . దీనికి నిర్వచనంగానే తమిళనాడులో ముత్యాలమ్మ పక్కన రేణుకాదేవి శిరస్సుని ఉంచి పూజిస్తారు .

అమ్మవారికి నిత్యం వేపాకుతో సాంబ్రాణి ధూపం వెయ్యడం వలన చల్లబడుతుంది అని ప్రజల విశ్వాసం . దీనికి చిహ్నంగానే ఆవిడకి కల్లు సాక పోస్తుంటారు . అమ్మవారు ఆగ్రహిస్తే అంటు వ్యాధులు ప్రబలుతాయి కావున నిత్యం చల్లగా ఉండాలని ఈ కల్లు లేదా బెల్లము లేదా అల్లము సాకగా పోస్తుంటారు . నిత్యం చల్లగా ఉండి తన భక్తుల అందు కరుణతో ఉండటం వలన ఈవిడకి శీతల అని కూడా పేరు ఉంది . అమ్మవారిని సేవిస్తే జ్వర పురుషుడు శమిస్తాడు అని వ్యాధి పురుషుడు విరిగిపోతాడు అని నానుడి . అమ్మవారికి శీతల అష్టకంతో పూజలు చేయొచ్చు . ప్రజల తమ తమ ఆచారాల ప్రకారం ఆనవాయితీల ప్రకారం అమ్మను కొలిచి శాంతితో వర్ధిల్లాలి . జై మాత .
Share on Google Plus

About Guru Vara Prasad

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment